గుట్ట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌కు ఊరట

ABN , First Publish Date - 2023-02-02T00:45:01+05:30 IST

యాదగిరిగుట్ట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుధా మహేందర్‌గౌడ్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మునిసిపల్‌ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్ట ర్‌ స్వీకరించడంతోపాటు అవిశ్వా సం ప్రక్రియ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె హైకోర్టులో పి టిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

గుట్ట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌కు ఊరట

అవిశ్వాసంపై స్టే విధించిన హైకోర్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుధా మహేందర్‌గౌడ్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మునిసిపల్‌ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్ట ర్‌ స్వీకరించడంతోపాటు అవిశ్వా సం ప్రక్రియ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె హైకోర్టులో పి టిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెలంగాణ మున్సిపాల్టీస్‌ యాక్ట్‌-2019 ప్రకారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ లేదా వైస్‌ చైర్‌పర్సన్‌ను తొలగించడానికి వార్డు సభ్యులకు అధికారం లేదని తెలిపారు. చట్టంలో అవిశ్వాసానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. అవిశ్వాసం ప్రక్రియపై మూడువారాలపాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.

కౌన్సిలర్లతో ఎలాంటి విభేదాలు లేవు : సుధాహేమేందర్‌గౌడ్‌

యాదగిరిగుట్ట రూరల్‌: తనకు కౌన్సిలర్లతో ఎలాంటి విభేదాలు లేవని యాదగిరిగుట్ట ము నిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుధాహేమేందర్‌గౌడ్‌ అన్నారు. యాదగిరిగుట్టలోని ఆమె కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. జనవరి 30న పాలకవర్గ సభ్యులు కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసులు అందజేశారని చెప్పారు. అందరం కుటుంబ సభ్యుల్లాగానే ఉన్నామని, కుటుంబంలో గొడవలు వస్తుంటాయి.. పోతుంటాయని, సర్దుకొని ముందుకు పోతామని చెప్పారు.

Updated Date - 2023-02-02T00:45:02+05:30 IST