Resignations: ప్రభుత్వం మారిందిగా.. ఇక రాజీనామాలు షురూ..
ABN , First Publish Date - 2023-12-06T12:33:59+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి నవీన్‌రావు రాజీనామా
మహబూబాబాద్ టౌన్,: తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మానుకోటలోని జిల్లా గ్రంథాలయంలో మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోర్నకల్ తాజామాజీ శాసనసభ్యుడు డీఎస్. రెడ్యానాయక్ ప్రతిపాదనతో మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 6 అక్టోబర్ 2017లో మహబూబాబాద్(Mahbubabad) జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు అన్ని విధాలుగా సహకరించిన మిత్రులు, డైరెక్టర్లు, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పాఠకులు, జర్నలిస్టులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌కు పంపినట్లు చెప్పారు.