Revanth Reddy: ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ మూడో కన్ను: రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2023-06-30T18:08:57+05:30 IST
జనగర్జన సభా ప్రాంగాణం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరిశీలించారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి రెండు కళ్ళు .. కాగా తమ మూడో కన్ను పొంగులేటి శ్రీనివాస రెడ్డి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసని, అలానే శ్రీనివాస రెడ్డి తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో 10కి 10 గెలిపించండి... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఎందుకు రాదో తాను చూస్కుంటానని రేవంత్ వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువా కప్పుకుంటే ఖమ్మం గడ్డ మీదనే కప్పుకుంటానని చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. జులై 2న రాహుల్ గాంధీ హాజరుకానున్న ఖమ్మం జనగర్జన సభా ప్రాంగణం, ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సభ ఏర్పాట్ల కోసం అవసరమైతే వీ హనుమంత్ ఖమ్మంలోనే ఉంటారని, ఢిల్లీలోని జాతీయ మీడియా మొత్తం ఖమ్మంకు వస్తుందన్నారు.
రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జూలై 2న తెలంగాణ జనగర్జన ఖమ్మం నడిబొడ్డున నిర్వహిస్తున్నామని రేవంత్ తెలిపారు. ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని పొంగులేటిని పలు దఫాలు ఆహ్వానించామని, కానీ ఆయన అభిమానుల సూచనల మేరకే ఆయన ఎటు వెళ్లాలో నిర్ణయించుకున్నారని చెప్పారు.
కేంద్రంలోని పార్టీ ఆయన్ను పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిందని, పొంగులేటి అభిమానులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని 85 శాతం మంది నిర్ణయించారని రేవంత్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ఆయన ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారని, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, కాంగ్రెస్ జాతీయ నాయకులు ఖమ్మం నగరానికి వస్తున్నామన్నారు. అక్కడ ఒక సభ ఏర్పాటు చేయాలని ఆదేశించారని రేవంత్ రెడ్డి వివరించారు.
ఎన్నో సలహాలు ఇవ్వాలనుకున్నా కానీ...
సభా ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చానని, ఇక్కడకు వచ్చేముందు తాను ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వాలని అనుకున్నానని రేవంత్ అన్నారు. కానీ ఇక్కడ పకడ్బందీగా సూచనాప్రాయంగా పనులు చేస్తున్నారని అన్నారు. తమ కార్యకర్తలు, అభిమానులు బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా నడుచుకుంటూ వచ్చి సభను విజయవంతం చేస్తారని అన్నారు. అవసరమైతే రెండవ తారీకు సన్నాసులు తాగి పడుకుంటారని, తమ కార్యకర్తలు అభిమానులను అడ్డుకోవాలని చూస్తే మిమ్మల్ని తొక్కుకుంటూ సభకు హాజరవుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమం అంతా కేసీఆర్ వెనకాల నిలబడినా 2014 తర్వాత మాత్రం ఆయన్ను ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబెట్టారని మండిపడ్డారు.