సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2023-05-04T00:47:48+05:30 IST

రాజాపే ట మండలం చల్లూరు గ్రామం లో చిన్న మేడారం సమ్మక్క సా రలమ్మ గద్దెల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సమ్మక్క సారలమ్మల ప్రతిమలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రతిష్ఠ

రాజాపేట, మే 3: రాజాపే ట మండలం చల్లూరు గ్రామం లో చిన్న మేడారం సమ్మక్క సా రలమ్మ గద్దెల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సమ్మక్క సారలమ్మల ప్రతిమలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో గుట్టపై చేరుకొని, ప్రత్యేక పూజలు చేశా రు. మేడారం పూజారులు కోయ లక్ష్మయ్య, కోయ పాపారావు ఆధ్వర్యంలో గద్దెల ప్రతిష్ఠ జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే ఫిబ్రవరిలో జాతర నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్‌ వంచ వీరారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-05-04T00:47:48+05:30 IST