Amit Shah : సంజయ్‌.. మీరు చాలా కష్టపడ్డారు!

ABN , First Publish Date - 2023-07-25T02:14:19+05:30 IST

‘‘సంజయ్‌ జీ..! చాలా కష్టపడ్డారు.. తెలంగాణలో పార్టీ గ్రాఫ్‌ పెరిగింది...

Amit Shah : సంజయ్‌.. మీరు చాలా కష్టపడ్డారు!

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ పెరిగింది

బండి సంజయ్‌కు అమిత్‌షా కితాబు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ‘‘సంజయ్‌ జీ..! చాలా కష్టపడ్డారు.. తెలంగాణలో పార్టీ గ్రాఫ్‌ పెరిగింది... ఇదే స్ఫూర్తితో పనిచేయండి’’ అని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నది తన బలమైన ఆకాంక్ష అని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో సోమవారం సంజయ్‌.. అమిత్‌షాను కలిశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత తొలిసారి అమిత్‌షాను సంజయ్‌ కలవగా, 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ సమావేశానికి సంబంధించి అమిత్‌షా స్వయంగా ట్వీట్‌ చేయడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను సంజయ్‌తో చర్చించినట్లు అమిత్‌షా వెల్లడించారు. దీనికి సంజయ్‌ రీట్వీట్‌ చేశారు. అపర చాణుక్యుడు అమిత్‌షాను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు.

Updated Date - 2023-07-25T02:15:48+05:30 IST