మురుగు ఇలా.. ఉండేదెలా?
ABN , First Publish Date - 2023-06-16T00:47:48+05:30 IST
ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నామని, మురుగునీటితో ఉండలేకపోతున్నామని చౌటుప్పల్‌లోని 14వ వార్డు ప్రజలు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని నిలదీశారు. పట్టణంలోని 14వ వార్డులోని గణే్‌షనగర్, వేంకటేశ్వర కాల నీ, కాటమయ్య కాలనీ, రాజేంద్రనగర్ కాలనీల్లో గురువారం ఎమ్మెల్యే పర్యటించారు.
చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే కూసుకుంట్లను నిలదీసిన స్థానికులు
చౌటుప్పల్ మునిసిపాలిటీ, జూన్15: ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నామని, మురుగునీటితో ఉండలేకపోతున్నామని చౌటుప్పల్‌లోని 14వ వార్డు ప్రజలు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని నిలదీశారు. పట్టణంలోని 14వ వార్డులోని గణే్‌షనగర్, వేంకటేశ్వర కాల నీ, కాటమయ్య కాలనీ, రాజేంద్రనగర్ కాలనీల్లో గురువారం ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీల్లో మురుగు నీటి దుర్వాసనతో ఉండలేకపోతున్నామని, వెంటనే సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్యేను నిలదీశారు. అదే విధంగా కాలనీలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు లేవని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ ఏడీతో మాట్లాడి స్తంభాల సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. మురుగునీటి సమస్య ఉన్నచోట సీసీ రోడ్లు పూర్తి చేయాలని ఏఈకి సూచించారు. ఆయా కాలనీల్లో వారం రోజుల్లో డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తామని హా మీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్లు సందగల్ల విజయసతీష్, పోలోజు శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్ మునిసిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు ఉడుగు రమేష్, తాడూరి పరమేష్, మునుకుంట్ల సత్యనారయణ, తోర్పునూరి నర్సింహ, రవి, గంగరాం, మన్నె ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, పెద్దిరెడ్డి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.