ఐటీ హబ్‌కు విశేష స్పందన : భూపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-05-27T01:01:07+05:30 IST

మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న నల్లగొం డ ఐటీ హబ్‌కు వివిధ సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎ మ్మె ల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

   ఐటీ హబ్‌కు విశేష స్పందన : భూపాల్‌రెడ్డి
కంపెనీ లోగోను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

ఐటీ హబ్‌కు విశేష స్పందన : భూపాల్‌రెడ్డి

నల్లగొండ, మే 26: మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న నల్లగొం డ ఐటీ హబ్‌కు వివిధ సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఎ మ్మె ల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేబీకే బిజినెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించిన సంస్థ యజమానులు శుక్రవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేబీకే సంస్థ యాజమాన్యం ఐటీ హబ్‌లో అవకాశం క ల్పించాలని కోరడం సంతోషకరమని అన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనఆర్‌ఐలు ఐటీహబ్‌ నుంచి తమ సంస్థలను నిర్వహించడానికి ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో 16కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయని, తాజాగా మరో ఆరు సంస్థలు ఎంవోయూపై సంతకాలు చేశాయన్నారు. ఇప్పటికీ మొత్తం 22సంస్థలు నల్లగొండ ఐటీ హబ్‌లో తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని తెలిపారు.పెద్దమ్మా...నీకు పింఛన వస్తుందా

Updated Date - 2023-05-27T01:01:07+05:30 IST