Share News

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-10-21T00:44:22+05:30 IST

రైతులు తాము పండించిన ధాన్యానికి గి ట్టుబాటు ధర పొందేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అనుముల తహసీల్దార్‌ జయశ్రీ అన్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తహసీల్దార్‌ జయశ్రీ

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

హాలియా, అక్టోబరు 20: రైతులు తాము పండించిన ధాన్యానికి గి ట్టుబాటు ధర పొందేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అనుముల తహసీల్దార్‌ జయశ్రీ అన్నారు. శుక్రవారం అనుముల మండలంలోని రామడుగు, పులిమామిడి, శ్రీనాధపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రభుత్వం గ్రేడ్‌-ఏ ధాన్యానికి రూ. 2,203, సాధారణ రకం ధా న్యానికి రూ. 2,150 నిర్ణయించిందని తెలిపారు. రైతులు 17శాతం తేమ వ రకు ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలన్నారు. కా ర్యక్రమంలో ఏపీఎం కళావతి, ఏవో సరిత, ఏఈవోలు దేవ, అరవింద్‌, వెలు గు సీసీలు సైదయ్య, మండల సమాఖ్య అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-21T00:44:22+05:30 IST