Telangana High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టేకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు
ABN , First Publish Date - 2023-05-25T17:38:49+05:30 IST
: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై (Group-1 prelims Exam) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే అంశంపై (Group-1 prelims Exam) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జూన్ 11న జరిగే పరీక్ష వాయిదా వేయాలని 36 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని TSPSC చైర్మన్, కార్యదర్శకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శి, సిట్‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది.