Congress: ఆ చాంపియన్‌కు రూ.5 లక్షల బహుమతిని ప్రకటించిన రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-01-08T18:20:31+05:30 IST

టీపీసీసీ ఆధ్వర్యంలో బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు సన్మానం చేశారు. నిఖత్‌ జరీన్‌కు కాంగ్రెస్‌ తరపున రూ.5 లక్షల బహుమతిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Congress: ఆ చాంపియన్‌కు రూ.5 లక్షల బహుమతిని ప్రకటించిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ ఆధ్వర్యంలో బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు సన్మానం చేశారు. నిఖత్‌ జరీన్‌కు కాంగ్రెస్‌ తరపున రూ.5 లక్షల బహుమతిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ బహుమతి ప్రకటన చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవన్నారు. అలాగే ప్రభుత్వం స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేయాలని సూచించారు. 26లోగా గ్రూప్ 1 ఆఫీసర్‌గా నిఖత్‌ జరీన్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-01-08T18:20:32+05:30 IST