Revanth Reddy: ఆయన పరోక్షంగా ప్రధానికి సహకరిస్తున్నారు: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-02-11T17:45:12+05:30 IST

సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు.

Revanth Reddy: ఆయన పరోక్షంగా ప్రధానికి సహకరిస్తున్నారు: రేవంత్‌రెడ్డి

భద్రాద్రి: సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. కేసీఆర్ పరోక్షంగా మోదీ (PM Modi)కి సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి (Singareni)ని ప్రైవేట్ పరం కానిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఆయన ఇవాళ కొత్తగూడెం (Kottagudem)లో సింగరేణి కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణిని కాపాడేందుకు కాంగ్రెస్ (Congress) చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే మైన్స్ను ప్రైవేట్ పరం చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. సింగరేణి సమస్యలపై పార్టీలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-02-11T18:00:56+05:30 IST