దేశ ప్రజల ఆకాంక్షతోనే బీఆర్‌ఎస్‌ ఆవర్భావం

ABN , First Publish Date - 2023-01-23T00:56:21+05:30 IST

దేశ ప్రజల ఆకాంక్షతోనే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిందని విద్యుతశాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్‌లో పార్టీలో చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పా ల్గొని మాట్లాడారు.

దేశ ప్రజల ఆకాంక్షతోనే బీఆర్‌ఎస్‌ ఆవర్భావం
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే లింగయ్య

దేశ ప్రజల ఆకాంక్షతోనే బీఆర్‌ఎస్‌ ఆవర్భావం

విద్యుతశాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

నకిరేకల్‌, జనవరి 22: దేశ ప్రజల ఆకాంక్షతోనే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిందని విద్యుతశాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్‌లో పార్టీలో చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పా ల్గొని మాట్లాడారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి గెలిచిన నకిరేకల్‌ మునిసిపల్‌ 6వ వార్డు కౌన్సిలర్‌ మట్టిపల్లి కవితవీరూతో పాటు సుమారు 300 మంది మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా మం త్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా ఆచరిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతుందన్నారు. తెలంగాణ మాదిరిగా 24 గంటల కరెంట్‌ మాకెందుకు లేదని దేశ ప్రజలు ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిజం నిప్పు లాంటిదని ఎ వరెన్ని దుష్ప్రచారాలు చేసిన వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. పార్టీలో చేరిన అందిరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రుల వద్దకు వెళ్లి నిధులు మంజూరు చేయాలని అడుగుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిస్వార్థపరుడని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, జగదీ్‌షరెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విఽధాలుగా అభివృద్ధి చే స్తున్నానని అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ గుం డెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నానన్నారు. నకిరేకల్‌ ప్రజలు ప్రశాంతమైన పా లనను కోరుకుంటున్నారని, కొందరు ముసుగు దొంగలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నకిరేకల్‌ మునిసిపల్‌ చైర్మన రాచకొండ శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, నకిరేకల్‌ మార్కెట్‌ చైర్మన కొ ప్పుల ప్రదీ్‌పరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన నాగులవంచ వెంకటేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీనరావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, సోమ యాదగిరి, పెండెం సదానందం, చిట్యాల అశోక్‌, జనార్ధన, పలువురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-23T00:56:22+05:30 IST