కూలీల సమస్యలను పరిష్కరించాలి : ఐలయ్య
ABN , First Publish Date - 2023-04-16T00:16:54+05:30 IST
ఉపాధి హామీ కూలీల సమస్య లను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి నారి ఐల య్య డిమాండ్ చేశారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో మునుగోడు మం డలం కల్వలపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి మాట్లాడారు.
కూలీల సమస్యలను పరిష్కరించాలి : ఐలయ్య
మునుగోడు రూర ల్, ఏప్రిల్ 15: ఉపాధి హామీ కూలీల సమస్య లను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి నారి ఐల య్య డిమాండ్ చేశారు. శనివారం సంఘం ఆధ్వర్యంలో మునుగోడు మం డలం కల్వలపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి మాట్లాడారు. ఉపాధి కూలీలకు పనికి తగిన కూలీ అందడం లేదని, పెరుగుతు న్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలకు పనిముట్లు, మెడికల్ కిట్లు ఇవ్వాలని, ఉపాధి పని దినాలు 200 రోజు ల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కూలీల సమస్యలపై ఏప్రిల్ 17, 18వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కత్తుల లింగస్వామి, జీఎంపీఎస్ జిల్లా అ ధ్యక్షు డు సాగర్ల మల్లేష్, మండల కార్యదర్శి శివర్ల మహేష్, నాయకులు కూతు రు న ర్సిరెడ్డి, గోలి అరుణ, అందే జయమ్మ, ఎర్ర పార్వతమ్మ, నూరు మహమ్మద్, రం జా్‌సబీ, యల్లమ్మ, పార్వతమ్మ, రాములు, యాదయ్య పాల్గొన్నారు.