కృష్ణానదిలో రాష్ట్ర వాటా తేల్చని కేంద్రం

ABN , First Publish Date - 2023-04-24T00:42:53+05:30 IST

కృష్ణానదిలో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 20న చౌటుప్పల్‌లో ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం గట్టుప్పల్‌ మండలంలోని అంతంపేట, నామాపురం, మర్రిగూడ మండలంలోని కొట్టాల, మేటిచందాపురం, ఇందుర్తి, సరంపేట, శివన్నగూడ మీదుగా ఖుదాభక్ష్‌పల్లి వరకు సాగింది.

కృష్ణానదిలో రాష్ట్ర వాటా తేల్చని కేంద్రం

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం

గట్టుప్పల్‌, మర్రిగూడ, ఏప్రిల్‌ 23: కృష్ణానదిలో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 20న చౌటుప్పల్‌లో ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం గట్టుప్పల్‌ మండలంలోని అంతంపేట, నామాపురం, మర్రిగూడ మండలంలోని కొట్టాల, మేటిచందాపురం, ఇందుర్తి, సరంపేట, శివన్నగూడ మీదుగా ఖుదాభక్ష్‌పల్లి వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సత్యం మా ట్లాడుతూ, కృష్ణానది ప్రవహిస్తున్నా మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటి వసతులు లేక పల్లెలు వల్లకాడుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఫ్లోరోసి్‌సతో ఎంతోమంది దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. కృష్ణానదిలో రాష్ట్రానికి 411 టీఎంసీల నీరు దక్కాల్సి ఉండగా, కేవలం 200 టీఎంసీలకు పరిమితం చేశారని మండిపడ్డారు. తక్షణమే కృష్ణానది లో రాష్ట్ర వాటాను తేల్చాలని డిమాండ్‌ చేశారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేయాలని డిమాం డ్‌ చేశారు. రైతుల రూ.1లక్ష లోపు రుణాల మాఫీ, దళితులందరికీ దళితబంధు ఇవ్వాలన్నారు. సీపీఐ పాదయాత్రకు నామాపురంలో ఫ్లోరోసిస్‌ విముక్తి పోరాట సమితి కన్వీనర్‌ కంచుకట్ల సుభాష్‌, కొట్టాలలో బీఆర్‌ఎస్‌ మండల నాయకుడు గంటకృష్ణ ఘనస్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ఖుదాభక్ష్‌పల్లి గ్రామం లో నాయకులు రాత్రి బస చేశారు. కార్యక్రమంలో ఆర్‌.అంజయ్యచారి, బచ్చనగో ని గాలయ్య, కె.శ్రీనివాస్‌, గురిజ రామచంద్రం, బొల్గూరి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, జగన్‌, భిక్షంరెడ్డి, రమేష్‌, సురేష్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-24T00:42:53+05:30 IST