పసుపు క్వింటాల్‌కు రూ. 11,211
ABN , First Publish Date - 2023-07-19T04:04:53+05:30 IST
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పసుపు అత్యధిక ధర పలికింది.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో రికార్డు ధర
ఖిల్లా (నిజామాబాద్ ), జూలై 18: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పసుపు అత్యధిక ధర పలికింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపేట్‌కు చెందిన రమేశ్ అనే రైతు తీసుకొచ్చిన పసుపును వ్యాపారులు రికార్డు స్థాయిలో.. క్వింటాల్‌కు రూ. 11,211 చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు క్వింటాల్ పసుపు ధర రూ. 6 నుంచి 7వేల వరకు ఉండగా, జూలైలో కొందరు రైతులు రూ. 10 వేలకు అమ్ముకున్నారు. తాజాగా మంగళవారం రికార్డు స్థాయిలో క్వింటాల్ రూ. 11,211 పలకడం గమనార్హం. నాణ్యమైన పసుపు తీసుకొచ్చే రైతులకు మంచి ధర కల్పిస్తున్నట్టు వ్యాపారులు చెబుతుండగా, మొన్నటివరకు సిండికేట్‌గా ఉన్న వ్యాపారులు ప్రస్తుతం పసుపు దిగుబడి తగ్గడం వల్లే అధిక ధరకు కొనుగోలు చేస్తున్నట్టు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.