TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరికి బెయిల్‌

ABN , First Publish Date - 2023-05-15T18:10:47+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు (TSPSC paper leak case)లో మరో ఇద్దరికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డాక్యా, రాజేశ్వర్‌నాయక్‌కు కోర్టు బెయిల్‌ ఇస్తూ...

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో మరో ఇద్దరికి బెయిల్‌

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు (TSPSC paper leak case)లో మరో ఇద్దరికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డాక్యా, రాజేశ్వర్‌నాయక్‌కు కోర్టు బెయిల్‌ ఇస్తూ... పలు షరతులు విధించింది. వారంలో 3 రోజులు సిట్‌కు రావాలని కోర్లు షరతు పెట్టింది. రూ.50 వేల పూచీకత్తుతో పాటు 2 జామీన్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల 8మందికి నాంపల్లి కోర్టు (Nampally Court) బెయిల్ మంజూరు చేసింది. 50వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని ఆదేశించింది. పోలీసు విచారణకు సహకరించాలని, నిర్దేశించిన తేదీల్లో సిట్ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. నీలేష్ నాయక్, కెతావత్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో రేణుక రాథోడ్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తు, పాస్‌ పోర్టు సమర్పించాలని.. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్‌ ఎదుట హాజరు కావాలని కోర్టు రేణుకను ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) అసిస్టెంట్‌ ఇంజనీర్‌, ఏఈఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఏ3గా ఉన్న రేణుక కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి రమేశ్‌, ప్రశాంత్‌లకు కూడా కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - 2023-05-15T18:10:52+05:30 IST