Share News

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి, మంద జగన్నాథం

ABN , First Publish Date - 2023-11-18T04:22:42+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రె్‌సలోకి నేతల వలసలు పెరుగుతున్నాయి.

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి, మంద జగన్నాథం

కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

కాంగ్రెస్‌ గూటికి మంద జగన్నాథం

రేపు కాంగ్రె్‌సలోకి డాక్టర్‌ వినయ్‌కుమార్‌

ఖర్గేను కలిసిన పటేల్‌ రమేశ్‌ రెడ్డి

హైదరాబాద్‌/గద్వాల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రె్‌సలోకి నేతల వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి శుక్రవారం హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి.. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తన పార్టీని టీఆర్‌ఎ్‌సలో విలీనం చేసి.. ఆ పార్టీ తరపున మెదక్‌ ఎంపీగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రె్‌సలో చేరి.. మెదక్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రె్‌సకు రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు. రెండు రోజుల కిందట ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌ నేత, నాలుగుసార్లు ఎంపీగా పనిచేసి ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్‌ మంద జగన్నాథం కూడా శుక్రవారం ఖర్గే సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ప్రత్యేక అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. జగన్నాథంతో పాటు అలంపూర్‌ నియోజకవర్గ నేత, ఆయన కుమారుడు మంద శ్రీనాథ్‌ కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్నాథం ఈ ఎన్నికల్లో శ్రీనాథ్‌కు అలంపూర్‌ టికెట్‌ ఆశించారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాంకు గానీ, శ్రీనాథ్‌కు గానీ ఇవ్వకుండా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చెప్పిన.. రాజకీయాలకు సంబంధం లేని విజయుడికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వడంతో జగన్నాథంనారాజ్‌ అయినట్లు తెలుస్తోంది. జగన్నాథం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ బీఆర్‌ఎ్‌సలో దళితులకు జరుగుతున్న అవమానాలను చూడలేక రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అబ్రహాం కూడా బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్‌ కుమారుడు డాక్టర్‌ వినయ్‌కుమార్‌ శనివారం ఖర్గే సమక్షంలో కాంగ్రె్‌సలో చేరనున్నారు. కాగా, సూర్యాపేటలో రెబెల్‌గా నామినేషన్‌ వేసి.. పార్టీ అదేశాల మేరకు పోటీ నుంచి విరమించుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమేశ్‌ రెడ్డితో పాటు ఆయన సోదరులు ఖర్గేను కలిశారు. రమేశ్‌ రెడ్డిని ఖర్గే అభినందించి, భవిష్యత్తులో పార్టీ తగిన గుర్తింపునిస్తుందని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-11-18T04:22:44+05:30 IST