బీసీలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పాలన

ABN , First Publish Date - 2023-02-03T00:27:14+05:30 IST

బీసీలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరు వెంకట్‌ నర్సింగరావు అన్నారు. కమలాపూర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పాలన
మాట్లాడుతున్న నియోజకవర్గ కాంగ్రె్‌సపార్టీ ఇన్‌చార్జి బల్మూరు వెంకట్‌ నర్సింగరావు

కాంగ్రె్‌స పార్టీ హుజూరాబాద్‌ ఇన్‌చార్జి ‘బల్మూరు’

కమలాపూర్‌, ఫిబ్రవరి 2 : బీసీలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్మూరు వెంకట్‌ నర్సింగరావు అన్నారు. కమలాపూర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ కమలాపూర్‌లో పాత పనులకే కొత్తగా ప్రారంభోత్సవాలు చేశారని అన్నారు. మంత్రి కేటీఆర్‌.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించేందుకే పర్యటన చేసినట్లుగా ఉందని అన్నారు. బీసీ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ను కాదని, తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన కౌశిక్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కమలాపూర్‌లోని కళాశాల భూమిని బీఆర్‌ఎస్‌ నాయకులు కబ్జాకు గురిచేస్తున్నారని మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్ళిన ఎన్‌ఎ్‌సయూఐ విద్యార్థులపై బీఆర్‌ఎస్‌ పార్టీ గుండాలు దాడి చేసి అక్రమంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న దాడులపై అడ్డుపడాల్సిన స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆ రోజు ఇదే జిల్లాలో మరో నియోజకవర్గంలో పర్యటన చేస్తూ రాజకీయ లబ్ధికోసం పరస్పర ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రె్‌సపార్టీ అధ్యక్షుడు చరణ్‌పటేల్‌, ఐలయ్య, వెంకన్నతదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-03T00:27:15+05:30 IST