చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
ABN , First Publish Date - 2023-05-25T00:49:54+05:30 IST
మద్దతు ధరతో రైతుల నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవా రం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి మంత్రి, ఆ శాఖ చైర్మన్ సర్దార్ రవీంద్రసింగ్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు విషయం పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
భువనగిరి అర్బన్, మే 24: మద్దతు ధరతో రైతుల నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవా రం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి మంత్రి, ఆ శాఖ చైర్మన్ సర్దార్ రవీంద్రసింగ్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు విషయం పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ముందస్తు ఆలోచనలతో పంట విస్తీర్ణం విపరీతంగా పెరిగి, ధాన్యం దిగుబడి కూడా బా గా వస్తోందన్నారు. కలెక్టర్లు, అధికారుల ముందస్తు ప్రణాళికతో గత ఏడాది కంటే అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, అయినా క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జిల్లాలో కురిసిన అకాలవర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాల్లో రైస్‌మిల్లుల వద్ద ధాన్యం దిగుబడికి స్థల సమస్య ఉందని, మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి ఆలస్యమవుతోందని, దీన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 325 కొనుగోలు కేంద్రాల ద్వారా 2, 27,483 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు తరలించామన్నారు. మిల్లుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీ త్వరగా పూర్తిచేసి ధాన్యం చెల్లింపులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని, కనీ స మద్దతు ధర సకాలంలో అందేలా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి,పౌరసరఫరాల అధికారి శ్రీనివా్‌సరెడ్డి, గోపీకృష్ణ అధికారులు పాల్గొన్నారు.