కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-01-17T00:22:25+05:30 IST

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డ్‌ కార్మికులకు కనీస వేతనాలు అందజేయాలని ఏఐటీయూసీ మెడికల్‌ కాంట్రాక్ట్‌ యూనియన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి
వినతిపత్రం అందజేస్తున్న దేవేందర్‌రెడ్డి

కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

దేవరకొండ, జనవరి 16: దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన, పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డ్‌ కార్మికులకు కనీస వేతనాలు అందజేయాలని ఏఐటీయూసీ మెడికల్‌ కాంట్రాక్ట్‌ యూనియన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆస్పత్రి సూప రింటెండెంట్‌ డాక్టర్‌ రాములునాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు రూ.12090 ఇవ్వాలని నిర్ణయించినా కాంట్రాక్టర్‌ కేవలం రూ.7500 ఇస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మెడిక ల్‌ కాంట్రాక్టర్‌ వర్కర్స్‌ యూనియన అధ్యక్షుడు గొల్లూరి ఆంజనేయులు, సిబ్బంది రామేశ్వరమ్మ, తారమ్మ, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T00:22:26+05:30 IST