తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే సామేలు
ABN , Publish Date - Dec 19 , 2023 | 12:19 AM
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.
అడ్డగూడూరు, డిసెంబరు 18: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వగ్రామం ధర్మారం గ్రామంలో ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేక రులతో మాట్లాడుతూ 22ఏళ్ల తన కష్టాన్ని బీఆర్‌ఎస్ గుర్తించలే దన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానికి కృతజ్జతలు తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు మంచి మెజార్టీతో కాంగ్రెస్‌కు దీవెనలు అందించారన్నారు. నిరు పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. గృహ నిర్మాణాలకు మాత్రమే ఇసుక వినియోగించు కోవాలన్నారు. వ్యాపారం చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, నాయకులు పోలేబోయిన లింగయ్య యాదవ్, చేడే చంద్రయ్య, ఇటికాల చిరంజీవి, కొప్పుల నిరంజన్‌రెడ్డి, నిమ్మనగోటీ జోజి, మాజీ జడ్పీటీసీ కొమ్ము సత్యానారాయణ, ఎంపీటీసీ పెండ్యాల భారతమ్మ, పాశం సత్యనారాయణ, చిప్పలపల్లి బాలు, గూడెపు పాండు తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ను హైద రాబాద్‌లోని ఆయన నివాసంలో మోత్కూరు కాంగ్రెస్ నాయకులు కలిసి సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పురుగుల నర్సింహ, ఎండి. సమీర్, ఎండి. జానీ, ఎండి. ఖలీల్, సోమ లింగాచారి, ప్రకాష్‌రెడ్డి, నరేష్‌రెడ్డి పాల్గొన్నారు. ధర్మారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సామేల్‌ను మోత్కూరు మునిసిపల్ కోఆప్షన్ సభ్యురాలు పోలినేని ఆనందమ్మ, స్వామిరాయుడు సన్మానించారు.