యాదగిరి ఆలయం అద్భుతం

ABN , First Publish Date - 2023-02-04T00:29:03+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం చరిత్రాత్మకం, అద్భుతమని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసైసౌందర్‌రాజన్‌ అన్నారు. శుక్రవారం యాదగిరిక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సి ఉండటంతో మీడియాతో మాట్లాడకుండానే హైదరాబాద్‌కు వెళ్లారు.

యాదగిరి ఆలయం అద్భుతం

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌

35 నిమిషాల పాటు కొనసాగిన పర్యటన

గౌరవ వందన స్వీకారం.. స్వయంభువుల దర్శనాలు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 3: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం చరిత్రాత్మకం, అద్భుతమని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసైసౌందర్‌రాజన్‌ అన్నారు. శుక్రవారం యాదగిరిక్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సి ఉండటంతో మీడియాతో మాట్లాడకుండానే హైదరాబాద్‌కు వెళ్లారు. అసెంబ్లీలో ప్రసంగిస్తూ యాదగిరిగుట్ట దేవాలయ పునర్నిర్మాణ వైభవాన్ని ప్రస్తావించా రు. రాష్ట్ర ప్రజల కొంగు బంగారమైన పాంచనరసింహుడు కొలువుదీరిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ‘నా ప్రభుత్వం‘ వైభవోపేతంగా పునర్నిర్మాణం చేసిం దని కొనియాడారు. క్షేత్రంలో అడుగడుగునా ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసేలా తీర్చిదిద్దార ని,ఎంతో వైభవంగా ఆలయాన్ని పునర్నిర్మించారన్నారు. అంతకుముందు హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ నుంచి యాదగిరిగుట్టకు రోడ్డు మార్గంలో కాన్వాయ్‌లో ఉదయం 8.30గంటల కు చేరుకున్న గవర్నర్‌ కొండపైన ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని 9.05గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. యాదగిరిగుట్ట క్షేత్రంలో గవర్నర్‌ పర్యటన 35 నిమిషాల పాటు సాగింది. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆమెకు కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ ఈవో, ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. కొండపైన పడమటి దిశలోని అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా పోలీసు అధికారులు ఆమెకు గౌరవ వందనం అందజేశారు. లిఫ్టు గుండా ఆలయ తిరువీధుల్లోకి చేరుకుని ఉత్తర పంచతల రాజగోపురం నుంచి ప్రధానాలయంలోని వెళ్లారు. ప్రధానాల య ఉత్తర రాజగోపురం వద్ద దేవస్థాన అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. తూర్పు ఈశాన్య త్రితల రాజగోపురం నుంచి ప్రధానాలయంలోనికి ప్రవేశించిన గవర్నర్‌ ఆంజనేయస్వామిని, గండబేరుంఢ లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. ముఖమండపంలో స్వర్ణతాపడ ధ్వజస్తంభం, బలిపీఠానికి మొక్కి గర్భాయంలోనికి వెళ్లారు. గర్భాలయంలో అర్చకస్వాములు గోత్రనామాలతో సువర్ణ పుష్పార్చన పూజలు జరిపి హారతి, శఠగోపం అందజేశారు. ముఖమండపంలో ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, అర్చకబృందం, వేదపండితు లు చతుర్వేదాలతో ఆశీర్వచనం జరిపారు. దేవస్థాన ఇంచార్జి ఈవో రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పథిలు ఆమెకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. ప్రధానాలయంలో పూజలు, ఆశీర్వచనాల అనంతరం ఆమె ఉత్తర పంచతల రాజగోపురం నుంచి బయటకు వచ్చారు. దేవస్థాన అధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి ఫోటోలు దిగారు. అక్కడ నుంచి ఉత్తర దిశలోని లిఫ్టు గుండా కాన్వాయ్‌ వద్దకు చేరుకుని తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. ఆమె వెంట అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, ఆర్డీ వో భూపాల్‌రెడ్డి, దేవస్థాన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి దోర్భల భాస్కరశర్మ, ఏఈవో లు, జిల్లా యంత్రాంగం తదితరులున్నారు.

Updated Date - 2023-02-04T00:29:05+05:30 IST