YSRTP: ఓ ముఖ్య నేత ఓటమి లక్ష్యంగా వైఎస్సాఆర్టీపీ ప్లాన్ ఇదే!
ABN , First Publish Date - 2023-11-02T12:44:12+05:30 IST
రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్న వైఎ్‌సఆర్టీపీ ప్రధానంగా 50 నియోజకవర్గాల పై దృష్టి పెడుతోంది. పాలేరు సహా ఎంపిక చేసిన 50 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభల నిర్వహణకు
50 నియోజకవర్గాలపై వైఎస్‌ఆర్టీపీ దృష్టి
6న పాలేరులో షర్మిల నామినేషన్
కొడంగల్ నుంచి బ్రదర్ అనిల్ పోటీ..?
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్న వైఎ్‌సఆర్టీపీ ప్రధానంగా 50 నియోజకవర్గాల పై దృష్టి పెడుతోంది. పాలేరు సహా ఎంపిక చేసిన 50 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభల నిర్వహణకు పార్టీ అధినేత్రి షర్మిల ప్రణాళికలు రూపొ ందించుకుంటున్నారు. ఈ నెల 6న పాలేరు స్థానానికి షర్మిల నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైఎస్ విజయలక్ష్మి పూర్తిగా పాలేరుకే పరిమితమై షర్మిల తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తన భర్త, బ్రదర్ అనిల్ కుమార్‌ను సికింద్రాబాద్‌కు బదులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నుంచి బరిలో దించాలని షర్మిల ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో వైఎ్‌సఆర్టీపీ విలీనానికి చర్చలు జరిగినప్పుడు రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో కొడంగల్‌లో క్రిస్టియన్ ఓట్లను చీల్చి రేవంత్‌రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.