చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం: పురందేశ్వరి

ABN, First Publish Date - 2023-10-31T11:28:30+05:30 IST

విజయవాడ: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

విజయవాడ: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బాబు నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరుపై స్పందించిన ఆమె మాట్లాడుతూ చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని మేము తప్పు పట్టామని, నోటీసులివ్వకుండా.. విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని గతంలోనే తప్పు పట్టామన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా సరికాదన్నారు. మధ్యంతర బెయిల్ రావడం మంచిదేనని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-31T11:28:30+05:30