Share News

సమస్యలు పరిష్కరించాలని దీక్ష

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:25 PM

తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఒక రోజు దీక్ష చేపట్టారు

సమస్యలు పరిష్కరించాలని దీక్ష
దీక్షలో పాల్గొన్న సీఐటీయూ నాయకులు, కార్మికులు

ధర్మవరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఒక రోజు దీక్ష చేపట్టారు. సీఐటీయూ మండల కన్వీనర్‌ జేవీ రమణ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛభారత పేరుతో కార్మికులను ప్రభుత్వ పాఠశాలల శానిటేషన పనిచేయిస్తూ వారికి కేవలం రూ.6 వేలు, కంటెనజెంట్‌ ఆయాలకు రూ 4 వేలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. వారికి కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌ వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓ-2 గోపాల్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ దీక్షలో నాగవేణి, జయమ్మ, చౌడమ్మ, ముంతాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:25 PM