AndhraPradesh: 11 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
ABN , Publish Date - Jul 02 , 2024 | 06:16 PM
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. వారిని వివిధ జిల్లాల కలెక్టర్లుగా నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్‌ను బదిలీ చేసింది.
అమరావతి, జులై 02: రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. వారిని వివిధ జిల్లాల కలెక్టర్లుగా నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్‌ను బదిలీ చేసింది. ఇక పార్వతీపురం జిల్లా కలెక్టర్‌గా ఏ శ్యామ్ ప్రసాద్‌ని నియమించింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా కె. విజయ, కోనసీమ జిల్లా కలెక్టర్‌గా మహేష్ కుమార్ , పల్నాడు జిల్లా కలెక్టర్‌గా పి. అరుణ్ బాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఆనంద్, తిరుపతి జిల్లా కలెక్టర్‌గా డి. వెంకటేశ్వర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకురి శ్రీధర్, కడప జిల్లా కలెక్టర్‌గా తోలేటీ శివశంకర్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా చేతన్, నంద్యాల జిల్లా కలెక్టర్ బి. రాజకుమారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా హరేందిరా ప్రసాద్‌ను నియమించింది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని నలుగురు సీనియర్ ఐపీఎస్‌లను ఇటీవల బదిలీ చేసింది. ఆ కొద్ది రోజులకే పలువురు ఐఏఎస్ అధికారులను సైతం ఏపీ ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల కొలువు తీరింది. ఆ క్రమంలో సుపరిపాలన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్న విషయం విధితమే.