Home » IAS Officers
ఎన్ ప్రశాంత్ స్వస్థలం.. కేరళలో కన్నూర్ జిల్లాలోని తలస్సేరి . తిరువనంతపురంలోని లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టా అందుకున్నారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ఆ క్రమంలో 2007లో ఐఏఎస్‌కు ప్రశాంత్ ఎంపికయ్యారు.
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇవాళ(ఆదివారం) ఉత్తర్వులు జారీ చేశారు.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లూ అధికారుల మీద దబాయింపు పాలన చూసిన కొందరు కూటమి నేతలు, మేం మాత్రం తక్కువా అన్నట్టుగా అదే మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ స్థలం విషయమై నవాబు వారసులు, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుండగానే దాన్ని మూడో పార్టీకి కట్టబెడుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం హైకోర్టు తిరస్కరించింది.
తెలంగాణలో (Telangana) భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ (IAS transfer) జరిగింది. 13 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ(సోమవారం) ఉత్తర్వులు విడుదల చేసింది.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ఆదివారం పోస్టింగ్ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాటా ఆమ్రాపాలి, వాణి మోహన్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌లకు కీలక శాఖలు కేటాయించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్ భూముల బదలాయింపు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. కుంభకోణం జరిగినపుడు కలెక్టర్‌గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌ను
ఓ రాజకీయ నాయకునికి యువ ఐఏఎస్ అధికారిణి ఏడు సెకన్ల వ్యవధిలో అయిదు సార్లు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
క్యాడర్ వివాదంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు దారులన్నీ మూసుకుపోయాయి. ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు రిపోర్ట్ చేయాల్సిందేనని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశించడం..