Share News

అమరావతికి లైన్‌ క్లియర్‌!

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:56 AM

రాజధాని అమరావతికి నిధుల రాకకు ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు(ఏడీబీ) కలిసి ఇస్తున్న రూ.15,000 కోట్ల అప్పునకు సంబం ధించి త్రైపాక్షిక ఒప్పందాలు సిద్ధమయ్యాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ కె. భాస్కర్‌ తెలిపారు.

అమరావతికి లైన్‌ క్లియర్‌!

15 వేల కోట్ల రుణంలో కీలక ఘట్టం పూర్తి

ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం రూపకల్పన

డిసెంబరులో రూ.3,700 కోట్ల అడ్వాన్స్‌

అమరావతి, న్యూఢిల్లీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి నిధుల రాకకు ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు(ఏడీబీ) కలిసి ఇస్తున్న రూ.15,000 కోట్ల అప్పునకు సంబం ధించి త్రైపాక్షిక ఒప్పందాలు సిద్ధమయ్యాయని సీఆర్‌డీఏ కమిషనర్‌ కె. భాస్కర్‌ తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన త్రైపాక్షిక సమావేశం సజావు గా సాగిందన్నారు. ఢిల్లీలోని ప్రపంచబ్యాంకు కార్యాలయంలో ఒప్పంద రూప కల్పనపై సుధీర్ఘ కసరత్తు జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ కె.భాస్కర్‌, ఏడీసీఎల్‌ సీఎండీ లక్ష్మీపార్థసారఽథి, ఆర్థిక శాఖ అధికారి డి. సురేంద్ర, ప్రపం చబ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఏడీబీ) ప్రతినిధులు పాల్గొ న్నారు. రుణానికి సంబంధించి నియమ నిబంధనలు సిద్ధం చేశారు. డిసెంబర్‌ 11న జరిగే ఏడీబీ బోర్డు సమావేశంలో, అదే నెల 17న జరిగే ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ ఒప్పందాలకు ఆమోదం తీసుకుం టారు. ఆ తర్వాత మొత్తం అప్పు రూ.15,000 కోట్లలో 25 శాతం అంటే దాదాపు రూ.3,700 కోట్లను ఆ బ్యాంకులు అడ్వాన్సుగా విడుదల చేస్తాయి.

Updated Date - Nov 12 , 2024 | 04:56 AM