తుంగభద్రకు 192 టీఎంసీలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:00 AM
తుంగభద్ర జలాశయంలో 192 టీఎంసీల వరద వినియోగించుకోవచ్చని మంగళవారం జరిగిన టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది.
టీబీపీ డ్యాంలో 2024-25 నీటి చేరికపై తుది అంచనా
ఎల్లెల్సీ, కేసీ వాటాగా 30.793 టీఎంసీలు
అనంతపురం జిల్లాకు హెచ్చెల్సీ వాటా 29.434 టీఎంసీలకు అంచనా
టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ సమావేశం
కర్నూలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయంలో 192 టీఎంసీల వరద వినియోగించుకోవచ్చని మంగళవారం జరిగిన టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) వాటాగా 21.736 టీఎంసీలు, కేసీ కెనాల్ వాటాగా 9.057 టీఎంసీలు చొప్పున కర్నూలు జిల్లాకు 30.793 టీఎంసీలు కేటాయించారు. అనంతపురం జిల్లాకు హెచ్చెల్సీ కాలువకు 29.434 టీఎంసీలు కేటాయింపులు చేశారు. టీబీపీ బోర్డు ఇనచార్జి ఎస్‌ఈ నీలకంఠరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కర్నూలు జిల్లా ఇరిగేషన సర్కిల్ ఎస్‌ఈ బి.బాలచంద్రారెడ్డి వర్చువల్ ద్వారా హాజరయ్యారు. నీటి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు 212 టీఎంసీలు వరద వినియోగించుకునేలా రిజర్వాయర్ డిజైన చేశారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్-1 (కేడబ్ల్యుడీటీ) అవార్డు ప్రకారం కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాల్లో కాలువలకు నికర జలాల కేటాయింపులు చేశారు. ప్రతి ఏటా నీటి సంవత్సరం ప్రారంభంలో టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ సమావేశమై గడిచినపదేళ్లుగా జలాశయంలో చేరిన వరద లెక్కలు ఆధారంగా నీటి చేరికపై అంచనా వేస్తారు. నవంబరు లేదా డిసెంబరులో తుది అంచనాలు వేస్తారు. ఈ నీటి సంవత్సరంలో జూన నెలలో జరిగిన సమావేశంలో 172 టీఎంసీలు చేరవచ్చని అంచనా వేశారు. అందుకు ఎక్కుగా వరద వచ్చింది. దీంతో 192 టీఎంసీలకు తుది అంచనా వేశారు. ఈ మేరకు కేడబ్ల్యూడీటీ అవార్డు దామాషా ప్రకారం పంపిణీ చేశారు.
ఫ ఆంధ్ర వాటాగా 60.227 టీఎంసీలు
తుంగభద్ర జలాశయం నుంచి ఈ ఏడాది 192 టీఎంసీల వినియోగంపై అంచనా వేసి పంపకాలు చేశారు. బచావత అవార్డు ప్రకారం కర్ణాటక 138.990 టీఎంసీలు (65.56 శాతం)కు గానూ 125.878 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ వాటా 66.50 టీఎంసీలు (31.37 శాతం)కు గానూ 60.227 టీఎంసీలు, తెలంగాణ 6.51 టీఎంసీలు (3.07 శాతం)కు గానూ 5.896 టీఎంసీలు కేటాయించారు. కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ నీటి వాటా 24 టీఎంసీలకు గానూ 21.736 టీఎంసీలు, కేసీ కాలువ వాటా 10 టీఎంసీలకు గానూ 9.057 టీఎంసీలు, అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ వాటా 32.50 టీఎంసీలకు గానూ 29.434 టీఎంసీలు కేటాయింపులు చేశారు.
ఫ 33.071 టీఎంసీలు మిగులు:
తుంగభద్ర నీటి కేటాయింపులు పరిశీలిస్తే.. ఎల్లెల్సీ వాటా 21.736 టీఎంసీలకు గానూ 8.526 టీఎంసీలు వాడుకోగా 13.21 టీఎంసీలు మిగులుగా ఉన్నాయి. కేసీ కెనాల్ వాటా 9.057 టీఎంసీల్లో ఏమాత్రం వాడుకోలేదు. అనంతపురం జిల్లాకు హెచ్చెల్సీ వాటా 29.434 టీఎంసీలు కేటాయిస్తే 18.629 టీఎంసీలు వాడుకోగా 10.805 టీఎంసీలు మిగులుగా ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్ర వాటాలో 60.227 టీఎంసీలకుగాను 27.155 టీఎంసీలు ఇప్పటికే వినియోగించుకోగా.. డ్యాంలో 33.071 టీఎంసీలు మిగులు జలాలుగా ఉన్నాయి. ఎల్లెల్సీ కింద ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్, రబీలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు, 195 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు వరకు సాగునీరు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు.
ఫ రాష్ట్రాల వారిగా నీటి కేటాయింపులు (టీఎంసీల్లో):
--------------------------------------------------------
రాష్ట్రం వాటా కేటాయింపు
--------------------------------------------------------
కర్ణాటక 138.990 125.878
ఆంధ్రప్రదేశ 66.500 60.226
తెలంగాణ 6.510 5.896
---------------------------------------------------------
మొత్తం 212.00 192.00
------------------------------------------------------
ఫ ఏపీ వాటాలో ఆయా కాలువకు కేటాయింపులు (టీఎంసీల్లో):
---------------------------------------------------------------------------
కాలువ వాటా కేటాయింపు వాడుకున్నది మిగులు
-----------------------------------------------------------------------------
ఎల్లెల్సీ 24.00 20.736 8.526 13.21
కేసీ కెనాల్10.00 9.057 -- 9.057
హెచ్చెల్సీ 32.50 29.434 18.629 10.805
---------------------------------------------------------------------------
మొత్తం 66.50 60.227 27.155 33.071
---------------------------------------------------------------------------