చంద్రబాబు, లోకేశ్‌లపై చెరో 23 కేసులు!
ABN , Publish Date - Apr 18 , 2024 | 03:51 AM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లపై చెరో 23 కేసులు నమోదై ఉన్నాయి. నామినేషన్ల దాఖలు కోసం అడిగినప్పుడు పోలీస్ శాఖ
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లపై చెరో 23 కేసులు నమోదై ఉన్నాయి. నామినేషన్ల దాఖలు కోసం అడిగినప్పుడు పోలీస్ శాఖ ఈ వివరాలను వారికి ఇచ్చింది. వీటిని టీడీ పీ న్యాయ విభాగం ప్రస్తుతం పరిశీలిస్తోంది. చంద్రబాబుపై సీఐడీ ఎనిమిది కేసులు పెట్టింది. ఇవిగాక జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో ఇతరత్రా పదిహేను కేసులు నమోదు చేశారు. లోకేశ్‌పై సీఐడీ కేసు ఒకటి ఉంది. మిగిలిన కేసులు యువగళం పాదయాత్ర సమయంలో నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధిక భాగం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పెట్టారు.