Vijayawada floods: ఏపీలో వరదల కారణంగా మృతి చెందినవారి సంఖ్య విడుదల
ABN , Publish Date - Sep 04 , 2024 | 08:45 PM
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉప్పొంగిన వరదలతో పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయి. భారీ వర్షాలు వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది చనిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది.
అమరావతి: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉప్పొంగిన వరదలతో పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయి. భారీ వర్షాలు వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది చనిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వం పేర్కొంది. 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయాయని వివరించింది.
వరదల కారణంగా 22 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం పేర్కొంది. 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయని వివరించింది. వర్షం వరదలతో 6,44,536 మంది నష్టపోయినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. 193 రిలీప్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నట్టు వివరించింది. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్‌డీఆర్ఎఫ్ డీఆర్ఎఫ్ టీమ్‌లు రంగంలోకి దిగాయని పేర్కొంది. 6 హెలికాఫ్టర్లు పనిచేస్తున్నాయని, 228 బోట్లను సిద్ధం చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 317 మంది గజ ఈతగాళ్లను రంగంలో దింపామని, కృష్ణా నదికి 3 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిందని తెలిపింది.