మహిళలకు 33 శాతం రిజర్వేషన కల్పించాలి
ABN , Publish Date - Nov 03 , 2024 | 11:34 PM
ఆంఽధ్రప్రదేశలో మహిళలకు 33 శాతం రిజర్వేషన కల్పించాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎస్.గిడ్డమ్మ కోరారు.
ఫమహిళ సమైక్య కర్నూలు ఎంపీ నాగరాజుకు వినతి
కర్నూలు, న్యూసిటీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఆంఽధ్రప్రదేశలో మహిళలకు 33 శాతం రిజర్వేషన కల్పించాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎస్.గిడ్డమ్మ కోరారు. ఈ మేరకు ఆదివారం కర్నూలు పార్లమెంటు సభ్యులు బి.నాగరాజుకు ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిడ్డమ్మ మాట్లాడుతూ 25 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషనపై కూటమి పార్లమెంటు సభ్యులందరూ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు. సమావేశాలలో తనవంతు కృషి చేస్తానని ఎంపీ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రావణి, నగర కార్యదర్శి వి.భారతి, రుణుక, పావని, శారద, సుశీలమ్మ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.