Share News

ఘనంగా ఉమ్మడిశెట్టి పురస్కారాల ప్రదానోత్సవం

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:04 AM

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలోని ఎన్జీఓ హోంలో 36వ ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఉమ్మడిశెట్టి పురస్కారాల ప్రదానోత్సవం

అనంతపురం కల్చరల్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అనంతపురంలోని ఎన్జీఓ హోంలో 36వ ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడిశెట్టి సాహితీ ట్రస్టు ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికిగాను ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ పురస్కారానికి విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ బండి సత్యనారాయణ, ఉమ్మడిశెట్టి సతీ్‌షకుమార్‌ జాతీయ యువ పురస్కారానికిబెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, కవయిత్రి మానస చామర్తిని ఎంపిక చేశారు. వారికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ వాడ్రేవు చినవీరభద్రుడు చేతులమీదుగా వారికి పురస్కారాలు అందజేసి, సత్కరించారు. అనంతరం ఉమ్మడిశెట్టి సాహితీ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాధేయ రచించిన ‘అజేయుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Updated Date - Dec 23 , 2024 | 04:04 AM