Share News

KALAVA: 50 వేల మెజార్టీతో గెలుపు తథ్యం

ABN , Publish Date - May 04 , 2024 | 12:25 AM

ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో తన గెలుపు తథ్యమని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని 5, 6, 9 వార్డులలో రోడ్‌షో నిర్వహించారు. అదే విధంగా ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.

KALAVA: 50 వేల మెజార్టీతో గెలుపు తథ్యం
పార్టీలో చేరుతున్న వైసీపీ గోల్డ్‌స్మిత విభాగ నాయకుడు

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనవాసులు

రాయదుర్గం, మే 3: ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో తన గెలుపు తథ్యమని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని 5, 6, 9 వార్డులలో రోడ్‌షో నిర్వహించారు. అదే విధంగా ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఆయన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ప్రశాంతమైన పాలనను అందించామన్నారు. రైతులు, మైనార్టీలు, వ్యాపారస్థులు ప్రశాంతతను కోరుకుంటున్నారని దీంతో టీడీపీ గెలుపు సునాయసంగా ఉందన్నారు.

తొగటవీర క్షత్రియుల అభివృద్ధికి కృషి: కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులును మద్దతు ఇచ్చేందుకు తొగటవీర క్షత్రియ సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శుక్రవారం తొగటవీర క్షత్రియ కళ్యాణమండపంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకే ఓటు అడిగే హక్కుందన్నారు.


ముస్లింల రిజర్వేషన్లకు ఢోకా లేదు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లింల రిజర్వేషన్లు ఉండవని వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని నాలుగు శాతం రిజర్వేషనలకు ఎలాంటి ఢోకా ఉండదని శాసనమండలి మాజీ అధ్యక్షులు షరీఫ్‌ అన్నారు. రాయదుర్గం పట్టణంలోని షాదీమహల్‌లో ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించారు. అదే విధంగా కణేకల్లులో రోడ్‌షో నిర్వహించారు. సమావేశానికి కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. షరీఫ్‌ మాట్లాడుతూ ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడే విధంగా లౌకికవాదాన్ని పెంపొందించేలా చంద్రబాబు పాలన ఉంటుందన్నారు. కేవలం కేంద్రం సహకారం కోసం బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషనలను రద్దు చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 మంది లబ్ధిదారులకు దుల్హాన పథకాన్ని అందించానన్నారు.


టీడీపీలో చేరిన వంద కుటుంబాలు: రాయదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం వైసీపీకి బిగ్‌షాక్‌ తగిలింది. వైసీపీలో కీలక పాత్ర పోషించే వంద కుటుంబాల దాకా శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామానికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. శుక్రవారం కాలవ శ్రీనివాసులు నివాసంలో మెచ్చిరి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బోర్‌వెల్‌ నాగరాజురెడ్డి, సదాశివారెడ్డి ఆధ్వర్యంలో గ్రామవాసులు 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. రాయదుర్గం పట్టణంలోని గోల్డ్‌స్మిత వ్యాపారస్థుడు ఘనితో పాటు 25 కుటుంబాలు టీడీపీలో చేరారు. కణేకల్లు పట్టణంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు ఫకృద్దీన ఆధ్వర్యంలో 70 కుటుంబాలు చేరాయి. వీరికి కాలవ శ్రీనివాసులు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 04 , 2024 | 12:25 AM