Share News

యురేనియం తవ్వకాలకు బ్రేక్‌

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:57 AM

కప్పట్రాళ్ల అటవీ భూముల్లో యురేనియం నిక్షేపాల అంచనా కోసం 68 బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

యురేనియం తవ్వకాలకు బ్రేక్‌

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కర్నూలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కప్పట్రాళ్ల అటవీ భూముల్లో యురేనియం నిక్షేపాల అంచనా కోసం 68 బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ను ఆదేశించింది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కప్పట్రాళ్ల సహా 15 గ్రామాల ప్రజలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోబోమని.. తవ్వకాల ప్రక్రియను ఆపేయాలని సీఎం చంద్రబాబు మంగళవారం అధికారులను ఆదేశించారు.

Updated Date - Nov 16 , 2024 | 04:00 AM