Share News

High Court : రాజీ చేసుకున్నారు.. కేసు కొట్టేయండి

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:31 AM

చెక్‌ బౌన్స్‌ కేసులో రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో కేసును కొట్టి వేయాలని కోరుతూ హోం మంత్రి వంగలపూడి అనిత తరఫు న్యాయవాది హైకోర్టును

High Court : రాజీ చేసుకున్నారు.. కేసు కొట్టేయండి

హైకోర్టులో హోం మంత్రి తరఫు న్యాయవాది

పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేయాలన్న కోర్టు

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): చెక్‌ బౌన్స్‌ కేసులో రాజీ కుదిరిందని, ఈ నేపథ్యంలో కేసును కొట్టి వేయాలని కోరుతూ హోం మంత్రి వంగలపూడి అనిత తరఫు న్యాయవాది హైకోర్టును కోరు. అయితే.. ఫిర్యాదిదారు వేగి శ్రీనివాసరావుతో కుదుర్చుకున్న రాజీ ఏమిటి? ఏ అంశాల ప్రాతిపదికన రాజీ చేసుకున్నారో వివరిస్తూ పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజీకి సంబంధించి అన్ని వివరాలు తాజా అఫిడవిట్‌లో పేర్కొనలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలతో అఫిడవిట్‌ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన వద్ద తీసుకున్న రూ.70 లక్షల అప్పును చెల్లించేందుకు 2018లో అనిత చెక్కు ఇచ్చారని, అది చెల్లలేదని పేర్కొంటూ వేగి శ్రీనివాసరావు విశాఖపట్నం కోర్టులో 2019లో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, వేగి శ్రీనివాసరావుకు తనకు మధ్య రాజీ కుదిరినందున సంబంధిత కేసును కొట్టివేయాలని హోంమంత్రి అనిత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ సతీశ్‌ వాదనలు వినిపించారు. కేసును రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని పిటిషనర్‌, వేగి శ్రీనివాసరావు నిర్ణయించుకున్నారని, ఇరువురు రాజీపత్రాన్ని కూడా రాసుకున్నారని చెప్పారు.

Updated Date - Dec 03 , 2024 | 05:31 AM