Share News

వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:19 AM

వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుతపులి అసువులు బాసింది.

వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి

యాదమరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుతపులి అసువులు బాసింది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారుల కథనం మేరకు... అటవీ ప్రాంతంలో దుర్వాసన వస్తోందని, అక్కడో చిరుత కళేబరం పడివుందని పశువుల కాపర్లు సమాచారం ఇవ్వడంతో చిత్తూరు డీఎ్‌ఫవో భరణి, ఎఫ్‌ఆర్‌వో బాలకృష్ణారెడ్డి, ఎస్‌ఐ ఈశ్వర్‌ సిబ్బందితో కలసి వెళ్లి పరిశీలించారు. చిరుత మరణించి నాలుగైదు రోజులైంద ని, చిరుత కాళ్లు, దంతాలు కనిపించకపోవడంతో అపహరించారని నిర్ధారించారు. చిరుత కళేబరానికి తిరుపతి జూ వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించాక అటవీశాఖ అధికారులు దహనం చేశారు.

Updated Date - Oct 22 , 2024 | 03:19 AM