Share News

AP News: అయ్యో పాపం.. కూలి పనులు చేసుకునేవారి పాపకు రూ.18 కోట్ల ఇంజెక్షన్ కావాలి

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:34 PM

ఓ పేదింటికి కలలో కూడా ఊహించనంత పెద్ద కష్టం వచ్చింది. సొంత కష్టంతో కన్నబిడ్డను కాపాడుకోలేని దీనమైన స్థితి ఆ తల్లిదండ్రులకు ఎదురైంది. బిడ్డ ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆర్థిక సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.

AP News: అయ్యో పాపం.. కూలి పనులు చేసుకునేవారి పాపకు రూ.18 కోట్ల ఇంజెక్షన్ కావాలి

కర్నూలు: ఓ పేదింటికి కలలో కూడా ఊహించనంత పెద్ద కష్టం వచ్చింది. సొంత కష్టంతో కన్నబిడ్డను కాపాడుకోలేని దీనమైన స్థితి ఆ తల్లిదండ్రులకు ఎదురైంది. బిడ్డ ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆర్థిక సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ర మండలం పెద్దమరివీడుకు చెందిన అక్షయ అనే రెండేళ్ల చిన్నారి అరుదైన ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ (Spinal Muscular Atrophy (SMA)) వ్యాధితో బాధపడుతోంది. అయితే ఆ పసిపాప వైద్యం ఖరీదుకు రూ.18 కోట్లు ఖర్చవుతుంది.


హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్ జెనెటిక్ టెస్టులో చిన్నారి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. పాపకు రూ.18 కోట్లు విలువ చేసే ‘జోల్ జెరి ఇంజక్షన్’ ఇవ్వాలని వైద్యులు సూచించారు. ఈ వ్యాధి కారణంగా పాప ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని న్యూరో ఫిజిషియన్ డా.హేమంత్ కుమార్ తెలిపారు. అయితే చిన్నారి అక్షయ తల్లిదండ్రులు కూలి చేసి బతుకు వెళ్లదీస్తున్నారు. ఇంత డబ్బు ఎలా సేకరించాలో తెలియని వారు ఆర్థిక సాయం వేడుకుంటున్నారు. బిడ్డ ప్రాణాలు కాపాడాలని, ప్రభుత్వం ఆదుకోవాలని తల్లుదండ్రులు విన్నవించుకుంటున్నారు.


అసలు ఈ వ్యాధి ఏమిటి?

‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధిని తెలుగులోకి వెన్నెముక కండరాల క్షీణత (SMA)గా పిలుస్తారు. ఇది అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి. కేంద్ర నాడీ వ్యవస్థపై, అస్థిపంజర కండరాల కదలికలపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి మందులు ఉన్నాయి. రోగికి ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి రకాన్ని బట్టి వైద్యులు ఇంజెక్షన్లు ఇస్తారు.

Updated Date - Aug 16 , 2024 | 01:39 PM