ఒక శాతం లేబర్ సెస్ కార్మిక సంక్షేమ బోర్డుకు చెల్లించాలి
ABN , Publish Date - Dec 11 , 2024 | 11:31 PM
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న నిర్మాణ పనులకు చెందిన కాంట్రాక్టర్‌కు చెల్లించే సొమ్ములో ఒక శాతం లేబర్ సెస్ కార్మిక సంక్షేమ బోర్డుకు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సంబంధిత అధికారులకు ఆదేశిం చారు.
జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్
నంద్యాల కల్చరల్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న నిర్మాణ పనులకు చెందిన కాంట్రాక్టర్‌కు చెల్లించే సొమ్ములో ఒక శాతం లేబర్ సెస్ కార్మిక సంక్షేమ బోర్డుకు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సంబంధిత అధికారులకు ఆదేశిం చారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాల్‌లో లేబర్ సెస్ కార్మిక సంక్షేమ బోర్డుకు చెల్లించే అంశఽంపై సంబధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి నిర్మాణ సంస్ధ చట్టాన్ని అనుసరించి విధిగా మీసేవలోగాని, ఆనలైన ద్వారా రిజిస్ర్టేషన చేయాలని సభ్యులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణ పనులు అమలుచేసే ప్రభుత్వ శాఖల అధికారులు, బిల్డింగ్ ప్లానులు అప్రూవల్ చేసే సంస్ధలైన మున్సిపల్ కార్పొరేషన, పంచాయతీరాజ్, ఏపీఐఐసీలకు చెందిన సంస్ధలు ఒక శాతం లేబర్ సెస్ కార్మిక సంక్షేమ బోర్డుకు చెల్లించే అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో కార్మికశాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్, ఉపకార్మిక కమిషనర్ వెంకటేశ్వర్లు, సహాయ కార్మిక కమీషనరు బషిరున్నిసాబేగం, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.