Share News

బొలెరో వాహనాన్ని ఢీకొన్న లారీ

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:42 PM

పులివెందుల పట్టణం కడప రోడ్డులోని మెడికల్‌ కళాశాల సమీపంలో కోడిగుడ్ల బొలెరో వాహనాన్ని రేషన్‌ బియ్యం లారీ ఆదివారం రాత్రి ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవరు ప్రసాద్‌ తలకు గాయాలయ్యాయి.

బొలెరో వాహనాన్ని ఢీకొన్న లారీ
రోడ్డుపై పడి ఉన్న కోడిగుడ్లు

డ్రైవరుకు గాయాలు

పులివెందులటౌన్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పులివెందుల పట్టణం కడప రోడ్డులోని మెడికల్‌ కళాశాల సమీపంలో కోడిగుడ్ల బొలెరో వాహనాన్ని రేషన్‌ బియ్యం లారీ ఆదివారం రాత్రి ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవరు ప్రసాద్‌ తలకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా.. కడప నుంచి పులివెందులకు కోడిగుడ్ల బొలెరో వాహనం వస్తోంది. ఈ మేరకు ఎదురుగా వచ్చిన రేషన్‌ బియ్యం లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం, లారీల ముందు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బొలెరో వాహనం డ్రైవరు ప్రసాద్‌కు కూడా గాయాలవడంతో చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న వైఎ్‌సఆర్‌ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Nov 25 , 2024 | 11:42 PM