Share News

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Oct 01 , 2024 | 12:08 AM

కర్నూలు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ అతిథి గృహంలో నగర పాలక అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి భరత

కర్నూలు(అర్బన), సెప్టెంబరు 30: కర్నూలు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ అతిథి గృహంలో నగర పాలక అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్నాథగట్టు టిడ్కో వద్ద అంగనవాడీ కేంద్రం, అర్బన హెల్త్‌ సెంటర్‌, పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 23, 24 వార్డుల్లో సుద్దవాగు వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేయాలని అన్నారు. కిడ్స్‌ వరల్డ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు రోడ్డు విస్తరణకు సంబంధించి బాధితులతో మాట్లాడి త్వరగా పరిహారం అందించాలన్నారు. పాతబస్టాండు అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అలాగే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి రాధాక్రిష్ణ థియేటర్‌ మీదుగా ఒకటో పట్టణ పోలీసు స్టేషన వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సంకల్‌బాగ్‌, రాజవిహార్‌ ఎల్లమ్మ దేవాయలయం పుంచి పాతబస్తీ వరకు బండు రహదారుల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు, అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీకృష్ణ, ఎస్‌ఈ రాజశేఖర్‌, ఎంహెచఓ కే విశ్వేశ్వరరెడ్డి, సిటీ ప్లానర్‌ ప్రదీ్‌పకుమార్‌, ఎంఈ సత్యనారాయణ, డీసీపీ సంధ్యారాణి, ఆర్‌ఓలు ఇజ్రాయేలు, టీపీఆర్‌ఓ వెంకటలక్ష్మి, త జునైద్‌, మేనేజర్‌ చిన్నరాముడు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 12:08 AM