Share News

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక

ABN , Publish Date - Nov 22 , 2024 | 11:43 PM

మంత్రాలయంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక
మంత్రాలయంలో ట్రాఫిక్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐ రామాంజులు

డీఎస్పీ ఉపేంద్రబాబు

మంత్రాలయం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు అన్నారు. శుక్రవారం రాత్రి మంత్రాలయం, మాధవరం పోలీ్‌సస్టేషనలను అకస్మికంగా తనిఖీ చేశారు. అంతకుముందు మంత్రాలయం పుణ్యక్షేత్రంలో ట్రాఫిక్‌ నియంత్రణపై మధ్వమార్గ్‌ కారిడార్‌, ఎంటీఆర్‌ సర్కిల్‌, నదితీరం, 200 గదుల సముదాయం, నాగులదిన్నె రోడ్లు, హెలిపాడ్‌ గ్రౌండు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాఘవేంద్రస్వామి మఠం అధికారులు, రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమన్వయంతో ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక, మద్యం బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ వెంట మంత్రాలయం సీఐ రామాంజులు, మంత్రాలయం మాధవరం ఎస్‌ఐలు పరమేష్‌ నాయక్‌, విజయకుమార్‌, రాఘవేంద్ర, రామకృష్ణ, లక్ష్మన్నగౌడు, గోవిందు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 11:43 PM