ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 31 , 2024 | 03:44 AM
ఎవరిపైనా ఆధారపడవద్దని ఎంతో కష్టపడి చదివి, ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం సాధించలేకపోయానన్న వేదన ఆ యువతిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు.
బెళుగుప్ప, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఎవరిపైనా ఆధారపడవద్దని ఎంతో కష్టపడి చదివి, ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం సాధించలేకపోయానన్న వేదన ఆ యువతిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు, నాగమణి దంపతుల కూతురు నవ్య(22) ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. నవ్య బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌లో ఆరు నెలలు శిక్షణ తీసుకుంది. పలుమార్లు ఇంటర్వ్యూలకు హాజరైనా ఉద్యోగం రాలేదు. ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న ఓ బ్రోకర్ మోసగించాడు. దీంతో ఇక ఉద్యోగం రాదని భావించిన నవ్య.. ఆత్మహత్య పాల్పడింది.