‘ఆదోని అసెంబ్లీ సీటు వైశ్యులకే కేటాయించాలి’
ABN , Publish Date - Mar 15 , 2024 | 12:07 AM
ఆదోని అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం హర్షణీయమని, వైశ్యులకు చెందిన స్థానిక పారిశ్రామికవేత్త విట్టా రమేష్‌కు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల బద్రీనాథ్, ఆవోపా అధ్యక్షుడు వీటీ ప్రకాష్ కోరారు.
ఆదోని టౌన్, మార్చి 14: ఆదోని అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం హర్షణీయమని, వైశ్యులకు చెందిన స్థానిక పారిశ్రామికవేత్త విట్టా రమేష్‌కు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల బద్రీనాథ్, ఆవోపా అధ్యక్షుడు వీటీ ప్రకాష్ కోరారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో రాచోటి రామయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగాను, విట్టా కిష్టప్ప మూడుసార్లు మున్సిపల్ చైర్మన్ గాను, ఎంపికై నియోజకవర్గ ప్రజలకు సేవలందిచారని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్య వైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ మిరియాల వినీత, జిల్లా కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపాధక్షుడు జీ నారాయణ, ఆవోపా కార్యదర్శి మిరియాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
‘