Share News

AP News: నేడు తొలిసారి నెల్లూరుకు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే?

ABN , Publish Date - Aug 19 , 2024 | 09:22 AM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ (సోమవారం) తొలిసారి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సోమశిల ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.

AP News: నేడు తొలిసారి నెల్లూరుకు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే?

నెల్లూరు: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ (సోమవారం) తొలిసారి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సోమశిల ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. స్పిల్‌వే, ఆప్రాన్, దెబ్బతిన్న రక్షణ కట్టడాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. సోమశిల గ్రామంలో ప్రజలు, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పర్యటించనున్న ప్రాంతాల్లో భద్రతను, బందోబస్తుకు జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమీక్షించారు.


శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలి సందర్శన..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,570 కోట్ల పెట్టుబడులతో, 8,480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే రూ.900 కోట్ల పెట్టుబడులతో 2,740 మందికి ఉద్యోగాలు కల్పించే 7 పరిశ్రమలకు భూమిపూజ చేయనున్నారు.


అదేవిధంగా రూ.1,213 కోట్ల పెట్టుబడితో 4,060 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే మరో 5 పరిశ్రమల స్థాపనకు సంబంధిత ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అధికారిక సమాచారం మేరకు... సోమవారం ఉదయం 10.40 గంటలకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరి 11.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడనుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12గంటలకు శ్రీసిటీ వెళ్లనున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 09:22 AM