Share News

అన్ని పంట దిగుబడులను ప్రభుత్వమే కొనాలి

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:02 AM

రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే అన్ని రకాల పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

అన్ని పంట దిగుబడులను ప్రభుత్వమే కొనాలి
ర్యాలీ నిర్వహించిన మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసిపీ నాయకులు, రైతులు

కదం తొక్కిన రైతన్నలు

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే అన్ని రకాల పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధఽ్యక్షతన రైతులతో శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నూనెపల్లె ప్లైఓవర్‌ బ్రిడ్జి నుండి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ చేసి జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి బుగ్గన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని కోరారు. మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులు సాగు చేసిన అన్ని పంట దిగబడులకు గిట్టుబాటు ధరలను కల్పించి ప్రభుత్వమే కొనాలని కోరారు. విత్తనాలను, ఎరువులను రైతులకు సమృద్ధిగా అందించి సబ్సిడీ ఇవ్వాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేయాలని, రైతులకు ఏడాదికి 20వేలు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్ప రవిచంద్రకిషోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, నందికొట్కూర్‌ నియోజకవర్గ ఇనచార్జి డా. సుఽధీర్‌, జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 12:02 AM