Share News

టీడీపీలో ఆళ్ల నాని చేరిక వాయిదా

ABN , Publish Date - Dec 19 , 2024 | 03:56 AM

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరిక వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం ఆయన బుధవారమిక్కడ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాల్సి ఉంది.

టీడీపీలో ఆళ్ల నాని చేరిక వాయిదా

సీఎం చంద్రబాబు అందుబాటులో లేనందునే!

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరిక వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం ఆయన బుధవారమిక్కడ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాల్సి ఉంది. కానీ సీఎం అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారు. మంచి ముహూర్తం చూసుకుని మరో రోజు పార్టీ తీర్థం పుచ్చుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా.. గురువారం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. శుక్రవారం ఆయన కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు.

Updated Date - Dec 19 , 2024 | 03:56 AM