Share News

Amaravati : ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌గేర్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:27 AM

వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.

Amaravati : ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌గేర్‌

  • మళ్లీ సర్వీస్‌లోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు?

  • వీఆర్‌ఎస్‌ లేఖ వెనక్కి తీసుకుంటానని సంకేతాలు

  • ఒత్తిడిలో ఉండి పొరపాటున దరఖాస్తు చేశానని,

  • ప్రభుత్వం వెంటనే దాన్ని ఆమోదించిందని ఆవేదన

  • ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌ గేర్‌

  • ుఽ మళ్లీ సర్వీ్‌సలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు ?

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీతో అంటకాగిన ఆయన్ను జీఏడీకి సరెండర్‌ చేసింది. దీంతో తాను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు మూడు నెలల ముందస్తు నోటీసు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌కు జూన్‌ 25న లేఖ సమర్పించారు. సెప్టెంబరు 30తో నోటీసు గడువు ముగిసేలోగా ఆయన వీఆర్‌ఎ్‌సను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంది. అయితే వారం రోజుల వ్యవధిలోనే ఆయన వీఆర్‌ఎ్‌సను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం అనూహ్యంగా జీవో జారీ చేసింది.

ఆ జీవో సెప్టెంబరు 30 తర్వాత ఆమలులోకి వస్తుందని పేర్కొంది. దీంతో ఆ తేదీ వరకూ ఆయన రాష్ట్రంలోనే ఉండాలి. కానీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వదు. ఇదిలా ఉండగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.


వీఆర్‌ఎస్‌ దరఖాస్తును వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సీఎస్‌ కార్యాలయానికి సంకేతాలు పంపుతున్నారు. వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో తాను ఒత్తిడిలో ఉన్నానని, ప్రభుత్వం కూడా వెంటనే దాన్ని ఆమోదించిందని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.

తనను మళ్లీ సర్వీ్‌సలోకి తీసుకోవాలని ప్రవీణ్‌ ప్రకాశ్‌ దరఖాస్తు చేస్తారని సమాచారం. ప్రస్తుతం సీఎస్‌ కార్యాలయంలో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. కానీ, ఇప్పటి వరకూ ఆయన సీఎ్‌సకు ఎలాంటి దరఖాస్తు చేయలేదు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని ముందే భావించిన ప్రభుత్వం ఆయన వీఆర్‌ఎ్‌సను వెంటనే ఆమోదించింది. సెప్టెంబరు 30న కచ్చితంగా రిలీవ్‌ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన దరఖాస్తుపై పునరాలోచన చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - Aug 21 , 2024 | 05:27 AM