Share News

అమిత షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

ABN , Publish Date - Dec 21 , 2024 | 11:43 PM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత షాను కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి వెంటనే తొలగించాలని సీపీఎం సీనియర్‌ నాయకుడు మల్లయ్య, జైభీం వ్యవస్థాపకుడు అవతారం డిమాండ్‌ చేశారు.

అమిత షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి
గోనెగండ్లలోని రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

కౌతాళం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత షాను కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి వెంటనే తొలగించాలని సీపీఎం సీనియర్‌ నాయకుడు మల్లయ్య, జైభీం వ్యవస్థాపకుడు అవతారం డిమాండ్‌ చేశారు. శనివారం కౌతాళంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అమితషా వ్యాఖ్యలకు నిరసగా అంబేడ్కర్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం వల్ల నేడు భారతీయ పౌరులు దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారని, అలాంటి మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అమితషా చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు జగదీష్‌, వీరేష్‌, అవాజ్‌ కమిటీ నాయకులు ఖాజా హుసేన, ఇద్రూష్‌ బాష, విశాక్‌ సాహెబ్‌, సర్పంచ పాల్‌దినకరన, జనసేనా నాయకులు రామాంజనేయులు ఉన్నారు.

గోనెగండ్ల: అబేండ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమితషాను బర్తరఫ్‌ చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు రంగన్న, సీనియర్‌ నాయకుడు మద్దిలేటినాయుడు, రైతు సంఘం నాయకుడు మాలిక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రమైన గోనెగండ్లలోని కర్నూలు బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ బీజేపీ కుల, మత, వర్గ, భాషా పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేట్‌ పరం చేస్తూ అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అమిత షా భారత జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు రంగస్వామి, యూనుస్‌, శ్రీరాములు, నరసింహులు, నాగరాజు, నబి, రాముడు, నరసన్న, లక్ష్మన్న, దస్తగిరి, వెంకటేష్‌, మల్లేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 11:43 PM