Share News

అమితషాను బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Dec 20 , 2024 | 11:43 PM

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను అనుచిత వ్యాఖ్యలతో అవమానపరిచిన కేంద్ర హోం శాఖ మంత్రి అమితషాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. జగన్నాథం డిమాండ్‌ చేశారు.

  అమితషాను బర్తరఫ్‌ చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ, రైతుసంఘం నాయకులు

రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. జగన్నాథం

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను అనుచిత వ్యాఖ్యలతో అవమానపరిచిన కేంద్ర హోం శాఖ మంత్రి అమితషాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే. జగన్నాథం డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఐ, దళిత హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో కేంద్ర హోం శాఖ మంత్రిగా పదవులు అనుభవిస్తూ ఆ హక్కుల కల్పించిన అంబేద్కర్‌ను అవమానపరచడం దారుణమన్నారు. దేశ ప్రజలకు అమితషా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఆలోచనలు దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. అనంతరం అమితషా చిత్రపటాలను దహనం చేయడానికి సీపీఐ నాయకులు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పి. రామక్రిష్ణారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌. మునెప్ప, సమితి జిల్లా కార్యదర్శి మహేష్‌, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 11:43 PM